SDPT: సిద్దిపేట రైతు బజార్లో కూరగాయల ధరలు భారీగా తగ్గడంతో సామాన్యులకు ఊరట లభించింది. బీన్స్, చిక్కుడు మినహా దాదాపు అన్ని రకాల కూరగాయలు కిలో 25 రూపాయలలోపే లభిస్తున్నాయి. టమాట రూ.16, క్యాబేజీ రూ.10 పలుకుతుండగా, ధరలు అందుబాటులోకి రావడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆకాశాన్నంటిన ధరలు ఇప్పుడు సామాన్యుడికి చేరువయ్యాయి.