మహబూబ్నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి కోరారు. 8వ డివిజన్ వార్డు సమావేశంలో పాల్గొన్న ఆయన, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.