RR: కేశంపేట మండల కేంద్రంలోని తిలక్ నగర్ కాలనీలో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. కాలనీలో ఎన్నో ఏళ్లకు పైగా నడిరోడ్డులో ఉన్న స్టే వైర్లతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సీసీ రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని తెలపడంతో కాలనీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను స్థానిక నాయకుల సహకారంతో విద్యుత్ సిబ్బంది తొలగించారు.