JN: శామీర్పేట, వెంకీర్యాల, గానుగపహాడ్, పెద్ద రాంచర్ల, పెద్దపహాడ్, గోపరాజుపల్లి, సిద్ధెంకి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మార్కెట్ ఛైర్మన్ శివరాజ్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ.. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు.