ASF: కౌటాల మండల కేంద్రం సమీపంలో విస్తరించిన అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఎండాకాలం కావడంతో ఎండిపోయిన చెట్లు, ఆకులు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు ఈ మంటలను గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు రంగంలోకి దిగి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు.