MLG: కోయగూడ గ్రామపంచాయతీ పరిధిలోని లంబాడి తండా పాఠశాలను సర్పంచ్ పోరిక సరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ… పాఠశాల సమగ్ర అభివృద్ధికి సహకరిస్తానని, పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు చిన్ననాటి నుంచి కష్టపడి చదివి ఉన్నత స్థానంలో ఉండాలన్నారు.