PDPL: పెద్దపల్లి పట్టణంలోని మిని ట్యాంక్ బండ్ ఎల్లమ్మ చెరువు సమీపంలో శనివారం ఉదయం పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ పట్టణ వాసులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రవీణ్ కుమార్, సుబ్బారెడ్డి, పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.