VKB: ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఏటీసీ ఐటీఐలలో నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు వికారాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్రబాబు తెలిపారు. వికారాబాద్ జిల్లా ఐటీఐలో ఈనెల 13న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళాలో వివిధ కంపెనీల యజమాన్యాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఐటీఐ చేసినవారు హాజరు కావొచ్చన్నారు.