WGL: నర్సంపేట మున్సిపాలిటీలో ఓ ఛానల్ న్యూస్ రిపోర్టర్ వడ్లకొండ పవిత్రన్ మాతృమూర్తి కీ.శే. ప్రేమనిల హార్ట్ స్ట్రోక్తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న TPCC సభ్యులు పెండెం రామానంద్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.