SDPT: హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల్ 44వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి మున్సిపల్ ఛైర్మన్ దండి లక్ష్మి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన బిపి మండల్ త్యాగం చిరస్మరణీయమన్నారు. జనాభా ప్రాతిపదికన అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలనే లక్ష్యంతో కృషి చేశారన్నారు.