KMM: వైరా సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఆవరణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను కలెక్టర్ అనుదీప్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న 4 జూనియర్, 9 సీనియర్ హాస్టల్ బ్లాకుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.