NZB: సిరికొండ మండలం పలు గ్రామాల్లో ఐకేపీ, ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పది రోజుల క్రితం ప్రారంభించిన సగానికి పైగా కేంద్రాల్లో ధాన్యం తూకం ప్రారంభించలేదు. కోతలు కోసి నెల రోజులు అవుతుందని ఇప్పటికీ తూకం చేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల వద్ద ధాన్యం రాశులు పేరుకుపోయాయని అధికారులు స్పందించి తూకం ప్రారంభించాలన్నారు.