SRD: రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే ‘గుడ్ సమరిటన్ల’కు ప్రభుత్వం ‘రహ్-వీర్’ పథకం ద్వారా రూ. 25,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తుందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ట్రాఫిక్ నిబంధనలు, రహ్-వీర్ పథక పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా రవాణాధికారి అరుణ పాల్గొన్నారు.