పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం న్యూ కొత్తపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నందాల మల్లేశం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉప సర్పంచ్ తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.