PLD: పిడుగురాళ్లలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఈనెల 14 నుంచి 20 వరకు జరుగుతాయి. తొలిరోజు అగ్నిమాపక అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ సీఐ వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రమాద నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు. బుధవారం పెట్రోల్ బంకులు, గోడౌన్లు, మాల్స్‌లో ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తామని ఫైర్ ఆఫీసర్ కే.శ్రీనివాసరావు తెలిపారు.