SRCL: కోనరాపేట మండలం వట్టిమర్ల గ్రామానికి చెందిన గంగారం నాగరాజు అనే రైతు ఆవు మంగళవారం విద్యుత్ ఘాతంతో మృతి చెందింది. ప్రతిరోజు లాగే తన ఆవును గ్రామ శివారులోని పొలం వద్ద కట్టేశాడు. ఆవు గడ్డి మేస్తున్న క్రమంలో ప్రమాద వశత్తు అక్కడ అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు మృతి చెందడంతో రైతు బోరున విలపించాడు.