ATP: నార్పల మండల కేంద్రంలో జెండర్ వనరుల కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రారంభించారు. మహిళలకు చట్టపరమైన సాయం, కౌన్సెలింగ్, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ కేంద్రం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం గ్రామ సంఘ సహాయకులకు 200 స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు.