CTR: గుడిపాల(M) లో టీడీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే తండ్రి, జీజేఎం డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. స్థానిక నేతలతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.