HYD: చంచలగూడ జైలులో రిమాండ్ ఖైదీ బాణావత్ రాందాస్ మృతి చెందారు. గత నెలలో తన భార్యాకుమారులను హత్య చేసిన కేసులో నిందితుడైన ఇతడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. అక్కడ అకస్మాత్తుగా ఫిట్స్ (మూర్ఛ) రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు సీఐ వెంకటేశ్వర్లు ధ్రువీకరించారు. నిందితుడు ఆమనగల్లు మండలం సీతారాం నగర్ తండా నివాసిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.