లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ మరణంపై ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి మరణానికి కోవిడ్ వ్యాక్సినే కారణమంటూ ఆయన పరోక్షంగా ఆరోపించాడు. ‘మా నాన్నకు ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం అస్సలు ఇష్టం లేదు. కానీ, నిబంధనల వల్ల అందరిలాగే బలవంతంగా 3 డోసులు వేయించుకోవాల్సి వచ్చింది’ అంటూ జాక్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు.