అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుర్బాజ్ తల్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుతో పాటు తోటి క్రికెటర్లు గుర్బాజ్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.