BDK: టేకులపల్లి మండల కేంద్రంలో 73 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు. మొత్తం రూ.17 లక్షల విలువైన సహాయాన్ని అందజేశారు. పేదలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ప్రభుత్వం తోడ్పడుతోందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు ఉండదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.