NGKL: ఐకేపీ వీవోఏలకు నెలకు రూ.20 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించింది. వీరికి సీపీఎం జిల్లా కార్య దర్శి వర్ధం పర్వతాలు మద్దతు తెలిపారు. రూ.20 లక్షల బీమా సౌకర్యం, రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన యూనిఫాం అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.