ADB: మేడిగూడలో ఉమ-మహేష్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, పారదర్శకంగా అర్హులకు ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, తహసీల్దార్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.