ELR: దెందులూరు మండలం సానిగూడెంకి చెందిన వేముల తిరుపతమ్మ సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు తెలిపారు. వెంటనే వారు ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.