MBNR: నవాబ్ పేట మండలంలోని యన్మన్ గండ్ల బస్ స్టాప్ వద్ద బస్సులు ఆపాలని కోరుతూ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు దూరం నడవాల్సి వస్తోందని విద్యార్థులు తెలిపారు. బస్ స్టాప్ వద్ద బస్సులు నిలిపితే తమకు ప్రయాణం సులభమవుతుందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.