మార్కాపురం జిల్లాలో వంటగ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అవసరమైనంత ఎల్పీజీ సిలిండర్ల స్టాక్ సిద్ధంగా ఉందన్నారు. గ్యాస్ అక్రమంగా నిల్వ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్గా ఉపయోగించే వారిపైనా చర్యలు ఉంటాయని చెప్పారు.