SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామివారిని శుక్రవారం మెగా హీరో సాయి దుర్గ తేజ్ దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. దీంతో ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అంతరం కొండగట్టుకు బయలుదేరనున్నారు.