MNCL: ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను సోమవారం అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు సాధించి శాఖకు మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.