WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న నిర్వహించనున్న అంబేద్కర్ ఉత్సవాలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని దళిత సంఘాల జేఏసీ నాయకులు ఆహ్వానించారు. జేఏసీ కన్వీనర్ గద్దల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాయకులు కలిసి ఆహ్వానం అందజేసి ఉత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ ఉత్సవాల కార్యక్రమానికి దళిత సంఘాల నాయకులు రావాలని తెలిపారు.