SRD: సిర్గాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం Arrive Alive ప్రోగ్రాం నిర్వహించారు. మండలంలో ఆయా గ్రామాలకు సంబంధించిన సర్పంచులను సమావేశపరిచి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి ఎస్సై మహేష్ అవగాహన కల్పించారు. గ్రామాలలోకి వెళ్లే రహదారుల భద్రత గురించి వివరించారు. ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీని నియమించి దీని ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.