VKB: వ్యవసాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులను అవలంభించాలని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ అన్నారు. బుధవారం డ్రోన్ ఆపరేటింగ్పై పైలెట్ ప్రాజెక్టుగా శిక్షణ ఇచ్చారు. సాంకేతిక ఆధారిత జీవనోపాధిని పొందేందుకు అవసరమైన మెలకువలు నేర్చుకోవాలని తెలిపారు. డ్రోన్ల నిర్వహణపై ఆరుగురికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.