ATP: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచనల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగీరథుని తపస్సు, పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు.