BPT: చీరాల ఒకటవ పట్టణ సీఐగా సోమశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. అలాగే స్థానిక సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.