ఏలూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంకట నాయుడు ఇవాళ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయ వ్యవస్థ పనితీరుపై ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఫలాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందడంలో సచివాలయ సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు.