NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ దేవస్థానంలో అవకతవకలపై దేవదాయ శాఖ విచారణ కమిటీని నియమించింది. తలనీలాల వేలం పాటల్లో అక్రమాలు, EO వ్యవహారశైలిపై త్వరలో విచారణ ప్రారంభం కానుంది. గతేడాది బకాయిలు చెల్లించని వ్యక్తులు ఈ ఏడాది మరో పేర్లతో వేలంలో కొనసాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందులో స్థానిక అధికారుల సహకారం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.