JGL: ధర్మపురిలో నూతనంగా ఎన్నికైన గ్రంథాలయ ఛైర్మన్ సంగనబట్ల దినేష్ను నిరుద్యోగ యువత శనివారం కలిసి, పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం పుస్తకాల సర్దుబాటుతో పాటు, టెట్, DSC, పోలీస్, గ్రామీణ నిరుపేద అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.