BHNG: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆసుపత్రిలో వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, మందుల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.