NRML: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను సహించబోమని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా, నదుల సహజ ప్రవాహం దెబ్బతిని భూగర్భ జల మట్టం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ప్రత్యేక తనిఖీలు (Special Drive) నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.