GDWL: గద్వాలలోని నల్లకుంటలో పెద్దపల్లి అజయ్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వల కొరత తీర్చేందుకు చేపట్టిన ఈ శిబిరంలో 106 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. దాతలకు అజయ్ సర్టిఫికెట్లు, పండ్లు పంపిణీ చేసి, వారి సామాజిక స్పృహను అభినందించారు.