NLG: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా కొమిరిశెట్టి నర్సింహులు నియమితులయ్యారు. హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆయనను నియమించారు. జిల్లాలో అత్యధికంగా పార్టీ జెండాలను ఆవిష్కరించి, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి నర్సింహులు చేసిన కృషిని మల్లన్న కొనియాడారు.