పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో విద్యార్థులకు కావాల్సిన రా మెటీరియల్, ఇంటర్నల్ రోడ్డు, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపునకు అవసరమైన నిధులు సమకూరుస్తానని ఎమ్మెల్యే విజయ రమణారావు హామీ ఇచ్చారు. ఈరోజు కళాశాలలో ఏర్పాటు చేసిన షార్ట్ టర్మ్ కోర్సులు, నేషనల్ అప్రెంటిషిప్ మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కోర్సుల ద్వారా త్వరగా ఉపాధి పొందవచ్చని తెలిపారు.