SRPT: కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-08 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. 18 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్న విద్యార్థులు, తమ పూర్వ స్మృతులను నెమరువేసుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, వారు తమ ప్రస్తుత స్థితిగతులను పరస్పరం తెలుసుకున్నారు.