ADB: నేరడిగొండ మండలంలోని గుత్పాల గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ పెందూర్ లక్ష్మి బాయి, ఉప సర్పంచ్ లింగంపల్లి రమ మంగళవారం శ్రీకారం చుట్టారు. గ్రామస్థుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మరిన్ని నిధులు వెచ్చించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.