ఆదిలాబాద్ జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన రోడ్డు భద్రత అవగాహన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.