KNR: కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక నివాసి సి.హెచ్. దేవేందరు చెందిన G+2 భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.