HNK: ఎంపీ డాక్టర్ కడియం కావ్య జన్మదినం సందర్భంగా ఎంపీని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనునిత్యం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతానని ఎంపీ కడియం కావ్య తెలిపారు.