WGL: భద్రకాళి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఛైర్మన్‌కు ఈవో సునీత, ప్రధానార్చకులు శేషు ఆహ్వాన పత్రం అందజేశారు. భద్రకాళి అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఛైర్మన్ తెలిపారు.