GDWL: యాసంగి సీజన్లో రైతులు పండించిన మొక్కజొన్నను సేకరించేందుకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ ఫెడ్ గద్వాల జిల్లా మేనేజర్ చంద్రమౌళి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయిజ, శాంతినగర్ సొసైటీల పరిధితో పాటు గద్వాల మార్కెట్ యార్డ్లో కూడా ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. రైతులు తమ పంటను దళారులకు అమ్మకుడదన్నారు.