VKB: రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సోమవారం కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల పట్ల ఆయన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మద్యం తాగి బండ్లు నడపడం నేరం అని సూచించారు.